భారీ నష్టాలతో…

ఇవాళ నిఫ్టి భారీ నష్టాలతో ముగిశాయి. ముఖ్యంగా మిడ్ సెషన్ తరవాత మార్కెట్లో తీవ్ర నష్టాల ఒత్తిడి వచ్చింది. గత శుక్రవారం అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఇవాళ ఆ ప్రభావం మార్కెట్‌పై కన్పించింది. అయితే నాస్డాక్ పతన ప్రభావం మన మార్కెట్‌పై పెద్దగా కన్పించలేదు. ఆరంభంలో ఐటీ షేర్లు నష్టపోయినా… క్లోజింగ్ సమాయానికల్లా ఐటీ సూచీ లాభాల్లోకి వచ్చింది. ముఖ్యంగా మిడ్ క్యాప్ ఐటీ షేర్లలో గట్టి మద్దతు లభించింది. ఇక నిఫ్టి షేర్లలో అదానీ ఎంటర్‌ప్రైజస్ ఏకంగా ఏడు శాతంపైగా లాభపడింది. ట్రేడింగ్ ముగిసే ముందు తాను అదానీ విల్మర్ నుంచి వైదొలగుతున్నట్లు అదానీ వెల్లడించింది. దీంతో ఉదయం నుంచి షేర్లో లాభాల కారణం తెలిసింది. ఈ కంపెనీలో అదానీకి 44శాతం వాటా ఉండగా, మొత్తం వాటాను విల్మర్‌కు విక్రయించనుంది. దీంతో రెండు షేర్లూ లాభాలతో ముగిశాయి. టెక్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్ కూడా లాభాల్లో ముగిశాయి. ఇక నష్టాల్లో ముగిసిన షేర్లలో హిందాల్కో ఉంది. ఈ షేర్‌తో పాటు టాటా మోటార్స్, ట్రెంట్, బీఈఎల్ షేర్లు ఏకంగా రెండు శాతంపైగా నష్టంతో ముగిశాయి.