స్థిరంగా ప్రారంభం

మార్కెట్ స్థిరంగా ప్రారంభమైంది. శుక్రవారం అమెరికా మార్కెట్ల భారీ పతనం తరవాత నిఫ్టి నిలకడగా ప్రారంభం కావడం విశేషం. ఆరంభంలో 23818ని తాకిన నిఫ్టి ఇపుడు 10 పాయింట్ల నష్టంతో 23603 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ కూడా 40 పాయింట్ల లాభంతో ఉంది. హెచ్చ్1 బీ వీసాలకు సంబంధించి అమెరికా తుదపరి అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మన ఐటీ కంపెనీలు ఎలా స్పందిస్తాయో చూడాలి. ఓపెనింగ్‌లో మాత్రం పెద్దగా మద్దతు లభించ లేదు. దీనికి కారణంగా గత శుక్రవారం వాల్‌స్ట్రీట్‌లో నాస్డాక్ ఒకటిన్నర శాతం నష్టంతో క్లోజ్ కావడం. ఇవాళ నిఫ్టిలో అదానీ ఎంటర్‌ప్రైజస్, అదానీ పోర్ట్స్ టాప్‌లో ఉన్నాయి. నిఫ్టి లూజర్స్‌లో ట్రెంట్, బీపీసీఎల్ టాప్‌లో ఉన్నాయి. మిడ్ క్యాప్స్‌పై ఇవాళ కూడా ఒత్తిడి కొనసాగుతోంది.