For Money

Business News

లాభాలతో ప్రారంభం…

2025 తొలి డెరివేటివ్‌ కాంట్రాక్ట్స్‌ లాభాలతో ప్రారంభమయ్యాయి. రోలోవర్స్ నిరాశాజనకంగా ఉన్నా నిఫ్టి ఇవాళ ఆకర్షణీయ లాభాలతో ప్రారంభమైంది. ప్రస్తుతం 100పాయింట్ల లాభంతో 23848 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ కూడా 319 పాయింట్ల లాభంతో ఉంది. దాదాపు ప్రధాన రంగాల సూచీలు గ్రీన్‌లో ఉన్నా… నామ మాత్రంగా ఉన్నాయి. ముఖ్యంగా నిఫ్టి బ్యాంక్‌ ఇవాళ మార్కెట్‌కు అండగా ఉంది. అలాగే ఆటోమొబైల్‌ కంపెనీలు కూడా. ఇవాళ నిఫ్టిలో టాప్‌ గెయినర్స్‌లో టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఎం అండ్‌ ఎం ఉన్నాయి. రీటైల్‌ లోన్‌ బుక్‌ను అమ్మకానికి పెట్టిన ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ కూడా గ్రీన్‌లో ఉంది. డాక్టర్‌ రెడ్డీస్‌లో లాభాలు కొనసాగుతున్నాయి. ఇక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఐటీ షేర్లు ఉండటం విశేషం. హెచ్‌సీఎల్‌ టెక్‌ టాప్‌ లూజర్‌ కాగా, అదానీ పోర్ట్స్‌ రెండో స్థానంలో ఉంది. ఇంకా టీసీఎస్‌, కోల్‌ ఇండియా, ఎల్‌ అండ్‌ టీ కూడా నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి.