For Money

Business News

హైదరాబాద్‌లో ఈడీ సోదాలు

విదేశీ పెట్టుబడులకు సంబంధించిన పలు నిబంధనలను ఉల్లంఘనతో పాటు పలు ఇతర ఆరోపణలు ఎదుర్కొంటున్న
ఇ-కామర్స్‌ కంపెనీలైన అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. కొంత మంది అమ్మకందారులకు ఈ కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆరోపణలు కూడా ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, ముంబై నగరాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం 19 చోట్ల సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ రెండు కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా అమ్మకాలు జరుపుతున్నట్లు ఫిర్యాదులపై కాంపీటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా దర్యాప్తు చేసింది. ఈ విచారణలో కంపెనీలపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలినట్లు తెలిస్తోంది. ఈ కంపెనీల వెబ్‌సైట్‌లలో సెర్చ్‌ చేస్తే కేవలం కొన్ని ‘ఎంపిక’ చేసిన అమ్మకందారుల పేర్లే కన్పించేలా అమెజాన్‌, ఫ్లిప్‌కార్డులు తమ ఆన్‌లైన్‌ వ్యవస్థను రూపొందించినట్లు సీసీఐ నివేదికలో ఉన్నట్లు ‘రాయిటర్స్‌’ వార్తా సంస్థ ఇటీవల ఓ కథనాన్ని ప్రచురించింది. ఆగస్టు 9వ తేదీన సీసీఐ నివేదికలు రెడీ అయ్యాయి. అమెజాన్‌కు సంబంధించి 1027 పేజీలు, ఫ్లిప్‌కార్ట్‌కు సంబంధించి 1696 పేజీల నివేదికను సీసీఐ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ నివేదికల్లో పలు అభియోగాలను మోపినట్లు వార్తలు వస్తున్నాయి.

Leave a Reply