చివరల్లో భలే రికవరీ

2024 చివరి నెలవారీ డెరివేటివ్స్ గ్రీన్‌లో క్లోజయ్యాయి. సరిగ్గా 1.30 గంటలకు నిఫ్టి గట్టి షాక్ ఇచ్చింది. ఉదయం గ్రీన్ నుంచి నష్టాల్లోకి జారుకున్న నిఫ్టి తరవాత చాలా వరకు గ్రీన్‌లోనే కొనసాగింది. సరిగ్గా 1.30 గంటలకు ఒక్కసారిగా వచ్చిన అమ్మకాల ఒత్తిడి కారణంగా 23653 పాయింట్లకు పడిపోయింది. అయితే అక్కడి నుంచి జెట్ స్పీడ్‌తో కోలుకుంది. దాదాపు 130 పాయింట్ల వరకు రికవరీ వచ్చింది. ఎట్టకేలకు మార్కెట్ 32 పాయింట్ల లాభంతో 23760 వద్ద ముగిసింది. ఇవాళ బ్యాంక్ నిఫ్టి మినహా మిగిలిన ప్రధాన సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ఇవాళ మొత్తం 2903 షేర్లు ట్రేడ్ కాగా, 1194 షేర్లు లాభాల్లో క్లోజ్ కాగా, 1619 షేర్లు నష్టాలతో ముగిశాయి. ఇవాళ మార్కెట్ బలహీనంగా ఉన్నా 88 షేర్లు అప్పర్ సర్క్యూట్‌ను తాకాయి. లోయర్ సర్క్యూట్ తాకిన షేర్ల సంఖ్య 56. ఇవాళ టాప్ గెయినర్స్‌లో అదానీ పోర్ట్స్ నిలిచింది. ఈ షేర్ 5.62 శాతం లాభపడింది. ఎం అండ్ ఎం, ఎస్బీఐ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, మారుతీ షేర్లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఇక నష్టాలతో ముగిని నిఫ్టి టాప్ లూజర్స్‌లో ఏషియన్ పెయింట్స్, టైటాన్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా కన్జూమర్, నెస్లే ఇండియా ఉన్నాయి.