మరో మెగా పబ్లిక్ ఆఫర్ రెడీ?

టాటా గ్రూప్ నుంచి మరో పబ్లిక్ ఆఫర్ రెడీ అవుతోంది. దాదాపు ఏడాది తరవాత ఈ గ్రూప్ నుంచి ఓ కంపెనీ ప్రైమరీ మార్కెట్లో ప్రవేశిస్తోంది. టాటా టెక్నాలజీస్ తరవాత టాటా క్యాపిటల్ ఐపీఓ మార్కెట్‌కు రానుంది. టాటా మోటార్స్ నుంచి విడగొట్టిన టాటా క్యాపిటల్ వచ్చే ఏడాది అంటే 2025లో పబ్లిక్ ఆఫర్‌కు రానున్నట్లు వార్తలు వస్తున్నాయి. పబ్లిక్ ఆఫర్ ప్రక్రియకు సలహాదారులను నియమించినట్లు సమాచారం. పబ్లిక్ ఆఫర్ రూ. 15000 కోట్లకు పైనే ఉండే అవకాశముంది. పబ్లిక్ ఆఫర్ ధరతో పాటు ఏమాత్రం వాటా మార్కెట్లో అమ్ముతారనే వివరాలు ఇంకా అందాల్సి ఉంది. 2025 సెప్టెంబర్‌లోగా ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ చేయాలని ఇది వరకు ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ ఏడాది జనవరిలో టాటా క్యాపిటల్‌లో టాటా క్యాపిటల్ ఫైనాన్స్ విలీనమైంది. ప్రస్తుతం ఈ కంపెనీ సుమారు రూ. 1.58 లక్షల కోట్లకు పైగా నిధులను నిర్వహిస్తోంది. ఈ కంపెనీలో ఇపుడు టాటా సన్స్‌కు 92.83 శాతం వాటా ఉంది.