ఏడాదిలో 30 శాతం జంప్?

ఏడాదిలో సెన్సెక్స్ 30 శాతం పెరిగే అవకాశముందని ప్రముఖ ఇన్వెస్ట్మెంట్, ఫైనాన్షియల్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అంచనా వేసింది. ఏడాదిలో సెన్సెక్స్ లక్ష మార్కుని దాటి 1,05,000కి చేరుతుందని పేర్కొంది. దేశ ఆర్థిక పరిస్థితి సజావుగా ఉండటం, మున్ముందు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ కూడా పెరిగే ఛాన్స్ ఉన్నందున .. స్టాక్ మార్కెట్ బాగా రాణిస్తుందని ఆ సంస్థ అంచనా వేసింది. 2025 డిసెంబర్ కల్లా సెన్సెక్స్ 30 శాతం పెరుగుతుందని పేర్కొంది. అతి తక్కువ స్థాయిలో కనిష్ఠ వృద్ధి సాధిస్తుందని అనుకున్నా 93000 స్థాయిని తాకుతుందని తెలిపింది. వాస్తవ వృద్ధి రేటు, వాస్తవ వడ్డీ రేట్లను పరిగణనలోకి తీసుకుంటే భారత మార్కెట్లు మరింత రాణిస్తాయని పేర్కొంది.