For Money

Business News

అయినా… బ్యాంకులు నచ్చలేదా?

నిఫ్టి ఇవాళ నష్టాలతో ముగిసింది. చిత్రంగా సీఆర్‌ఆర్‌ తగ్గించినా బ్యాంకు షేర్లు కొనేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపలేదు. ఏవో కొన్ని ప్రధాన షేర్లు మినహా. ఇక రియాల్టి షేర్లు మాత్రం బాగా పెరిగాయి. ఇవాళ ఆర్బీఐ క్రెడిట్‌ పాలసీ తరవాత నిఫ్టి నష్టాల్లోకి జారుకుని 24620ని తాకింది. అయితే సీఆర్‌ఆర్‌ తగ్గించిన వెంటనే నిఫ్టి పుంజుకుని 24751 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. కాని చివర్లో చాలా మంది ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరించడానికి సిద్ధమయ్యారు. దీంతో నిఫ్టి 30 పాయింట్ల నష్టంతో 24677 వద్ద ముగిసింది. అయితే నిఫ్టి నెక్ట్స్‌ 50 షేర్ల సూచీ 0.76 శాతం పెరగడం విశేషం. ఈ సూచీ ఆరంభం నుంచి చివరి దాకా లాభాల్లోనే కొనసాగింది. టాప్‌ గెయినర్స్‌గా వేదాంత, ఐఆర్‌ఎఫ్‌సీ, ఎన్‌హెచ్‌పీసీ, ఇండిగో, ఆర్‌ఈసీ షేర్లు ఉన్నాయి. ఇవాళ రైల్వే షేర్లు బాగా లబ్ది పొందాయి. అలాగే ప్రభుత్వ రంగ షేర్లు కూడా.అయితే అదానీ షేర్లు ఒక మోస్తరు నష్టాలతో ముగిశాయి. ఇక నిఫ్టిలో టాటా మోటార్స్‌ చివర్లో సూపర్‌ లాభాలతో ముగిసింది. మిడ్‌ సెషన్‌ వరకు నష్టాల్లో ఉన్న ఈ షేర్‌ ఒక్కసారిగా భారీ లాభాలు గడించి నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. అలాగే బజాజ్‌ కూడా కోలుకుంది. యాక్సిస్‌ బ్యాంక్‌, బీపీసీఎల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక నష్టాల్లో అదానీ పోర్ట్స్‌ ముందుంది. సిప్లా, భారతీ ఎయిర్‌టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.