ఐటీ అండతో..

మార్కెట్ ఇవాళ కూడా కీలక దశలను పరీక్షిస్తోంది. ఉదయం ఆరంభంలోనే 24539 పాయింట్లను తాకిన నిఫ్టి ఇపుడు 24500పైన కొనసాగుతోంది. బ్యాంక్ నిఫ్టి కూడా ఇవాళ నిలకడగా ఉంది. రేపు ఆర్బీఐ ఎంపీసీ కమిటీ నిర్ణయాలు రానున్నాయి. వడ్డీ రేట్లు తగ్గాయని అంచనాలు మార్కెట్లోఉన్నాయి. అయితే ఈసారి తగ్గించడం అనుమానమే వదంతులు కూడా ఉన్నాయి. మరోవైపు నిఫ్టికి ఇవాళ ఐటీ సెక్టార్ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. నిన్న రాత్రి అమెరికా మార్కెట్లో నాస్డాక్ భారీ లాభాల్లో ముగిసింది. ముఖ్యంగా ఎస్ఈసీ ఛైర్మన్‌గా పాల్ ఆట్కిన్స్ను నియమిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిశాయి. దీని ప్రభావం ఐటీ, టెక్ షేర్లపై పడుతోంది. నిఫ్టి టాప్ గెయినర్స్‌లో ఇన్ఫోసిస్, టీసీఎస్, అపోలో హాస్పిటల్స్, టెక్ మహీంద్రా టాప్‌లో ఉన్నాయి. నష్టాల్లో ఎన్టీపీసీ ముందుంది. ఈ షేర్ ఒక శాతం నష్టంతో ట్రేడవుతోంది.