For Money

Business News

ఫార్మా తప్ప…

దాదాపు అన్ని ప్రధాన రంగాల సూచీలు ఇవాళ నష్టాల్లో ముగిశాయి. అక్టోబర్‌ డెరివేటివ్స్‌ సిరీస్‌ బుల్‌ ఆపరేటర్లకు ఓ పీడకలగా మారిపోయింది. నిన్న ఒక్కసారిగా పెరిగినట్లే పెరిగి.. ఇవాళ పేకమేడలా ప్రీమియంలు కరిగిపోయాయి. అనేక కాంట్రాక్ట్‌లలో ప్రీమియంలు వంద శాతం తగ్గాయి. దీంతో చిన్న ఇన్వెస్టర్లు భారీగా నష్టపోయారు. ఎందుకంటే పెద్ద ఇన్వెస్టర్లు ఎపుడూ ఆప్షన్స్‌ను అమ్ముతారు కాబట్టి. ఇవాళ ఫార్మా, హెల్త్‌కేర్‌ మినహా ఇతర రంగాల షేర్లకు ఎలాంటి మద్దతు లభించలేదు. మీడియా రంగానికి మద్దతు అందినా నిఫ్టిపై ఈ సూచీ ప్రభావం అంతంత మాత్రమే. ఇవాళ ప్రధానంగా ఐటీ రంగం బాగా దెబ్బతీసింది. అనేక కీలక షేర్లు ఇవాళ నష్టాలతో ముగిశాయి. నిఫ్టి ఒక దశలో 24200 దిగువకు పడినా… మళ్ళీ స్వల్పంగా కోలుకుని 135 పాయింట్ల నష్టంతో 24205 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌ 653 పాయింట్లు క్షీణించింది. బ్యాంక్‌, మిడ్‌ క్యాప్‌ సెలెక్ట్‌, స్మాల్‌ క్యాప్‌ షేర్లలో ఒత్తిడి తీవ్రంగా ఉంది. అయినా నిఫ్టిలో 14 షేర్లు లాభాల్లో క్లోజ్‌ కావడం విశేషం. బ్రోకర్ల నుంచి గ్రాన్యూయల్స్‌ ఇండియా, ఎం అండ్‌ ఎంకు మద్దతు లభించింది. ఎం అండ్‌ ఎంలో అమ్మకాల ఒత్తిడి ఆగినట్లేనని బ్రోకర్లు భావిస్తున్నారు. ఇవాళ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచిన సిప్లా దాదాపు పది శాతం పెరిగింది. అలాగే అద్భుత ఫలితాల కారణంగా ఎల్‌ అండ్‌ టీ కూడా ఆరు శాతంపైగా లాభపడింది. ఇంకా ఓఎన్‌జీ
సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఎం అండ్‌ ఎంలు టాప్‌ గెయినర్స్‌లో ఉన్నాయి. ఇక టాప్‌ లూజర్స్‌ జాబితాలో హెచ్‌సీఎల్‌ టెక్‌ ముందుంది. ఈ షేర్‌ ఇవాళ 3.6 శాతం నష్టపోయింది. టెక్‌ మహీంద్రా నష్టాలు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. టీసీఎస్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌లు కూడా టాప్‌ లూజర్స్‌లో ఉన్నాయి.

Leave a Reply