అదరగొట్టిన ఫలితాలు
దేశంలోని అతి పెద్ద ఫార్మా కంపెనీ అయిన సన్ ఫార్మా తాజా త్రైమాసికంలో అద్భుత పనితీరు కనబర్చింది. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ నికర లాభం మార్కెట్ అంచనాలను మించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 2895 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని సీఎన్‌బీసీ టీవీ18 అంచనా వేసింది. అయితే కంపెనీ ఏకంగా రూ. 3040 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. అయితే కంపెనీ ఆదాయం మాత్రం మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. స్వల్పంగా మిస్సయింది. గత ఏడాది ఇదే త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ ఆదాయం రూ. 12192 కోట్ల నుంచి రూ. 13291 కోట్లకు చేరింది. అంటే పెద్దగా మార్పు లేదన్నమాట. అయితే నికర లాభం 28 శాతం వృద్ధితో రూ. 2375 కోట్ల నుంచి రూ. 3040 కోట్లకు చేరింది. కంపెనీ ఎబిటా కూడా 24 శాతం పెరిగింది. అలాగే మార్జిన్ కూడా 26 శాతం నుంచి 29.6 శాతానికి చేరినట్లు సన్ ఫార్మా వెల్లడించింది.