For Money

Business News

రష్యాకు అక్రమంగా ఎన్‌విడా చిప్స్‌

ఉక్రెయిన్‌తో యుద్ధం తరవాత రష్యాపై అమెరికా, పాశ్చాత్య దేశాలు పలు ఆంక్షలు విధించాయి. అయితే ఈ ఆంక్షలు తోసిరాజని ముంబైకి చెందిన ఓ ఫార్మా కంపెనీ రష్యాకు అక్రమంగా ఎన్‌విడియాకు చెందిన పవర్‌ఫుల్‌ చిప్స్‌ను రవాణా చేసినట్లు తెలుస్తోంది. ముందే అంధేరిలో ఉన్న శ్రేయ లైఫ్‌ సైన్సస్‌ అనే కంపెనీ అత్యాధునిక 1,111 యూనిట్ల ఎన్‌విడియా చిప్స్‌ను రష్యాకు పంపినట్లు బ్లూబర్గ్‌ వార్తా సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ వార్త భారత కార్పొరేట్‌ రంగంతో పాటు దౌత్య రంగంలోనూ సంచలనం సృష్టిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు మధ్య కాలంలో డెల్‌ టెక్నాలజీస్‌ ఇన్‌కార్పొరేషన్‌కు చెందిన అత్యాధునిక సర్వర్లను శ్రేయ లైఫ్‌ సరఫరా చేసినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. ఎగుమతులకు సంబంధించి వివిధ సంస్థల ఎగుమతుల షిప్‌మెంట్‌లను ట్రాక్‌ చేయడంతో ఈ వ్యవహారం బయటపడినట్లు బ్లూమ్‌బర్గ్‌ పేర్కొంది. పవర్‌ ఎడ్జ్‌ XE9680 పేరుతో పేరొందిన ఈ సర్వర్లలో హై ఎండ్‌ ప్రాసెసర్లు ఉంటాయి. వీటిని ఎన్‌వీడియో తయారు చేసింది. వీటిని ఏఎండీ కూడా తయారు చేస్తోంది. అయితే ఎగుమతి డేటాను పరిశీలించగా ఎన్‌విడియాకు చెందిన H100 చిప్స్‌ ఇందులో ఉన్నట్లు తేలింది.

Leave a Reply