స్విగ్గీ ఆఫర్ ధర ఖరారు
ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పబ్లిక్ ఆఫర్ నవంబర్ 6న ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. మార్కెట్ నుంచి రూ.11,300 సమీకరించేందుకు మార్కెట్‌కు వస్తున్న ఈ కంపెనీ పబ్లిక్ ఆఫర్ కోసం ధర శ్రేణి ఖరారు చేసింది. రూ. 10 ముఖ విలువ గల ఒక్కోషేర్ ధర శ్రేణి రూ. 371- రూ. 390 ఖరారు చేసింది. సాఫ్ట్‌బ్యాంక్ ప్రధాన వాటాదారుగా ఉన్న ఈ కంపెనీ వ్యాల్యూయేషన్ 1130 కోట్ల డాలర్లుగా లెక్కించారు. కొత్త షేర్ల జారీ ద్వారా రూ. 4500 కోట్లు సమీకరిస్తుండగా, ప్రస్తుత ఇన్వెస్టర్లు రూ.6800 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్నారు. ఈ కంపెనీలో ప్రొసస్కు 31 శాతం వాటా ఉంది. తన అనుబంధ సంస్థ ఎంఐహెచ్ ఇండియా ఫుడ్ హోల్డింగ్స్ తరఫున స్విగ్గీలో ఈ కంపెనీ పెట్టుబడి పెట్టింది. 100 కోట్ల డాలర్లను ఈ కంపెనీ ఇన్వెస్ట్ చేయగా… తన వాటాలో అయిదో వంతు వాటాలను అమ్మడం ద్వారా తన పెట్టుబడిలో సగం అంటే 50 కోట్ల డాలర్లను ప్రొసస్ పొందనుంది.