For Money

Business News

లాభాల్లో గిఫ్ట్‌ నిఫ్టి

గత శుక్రవారం వాల్‌స్ట్రీట్‌ మిశ్రమంగా ముగిసినా… ఫ్యూచర్స్‌ ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. పశ్చిమాసియా యుద్ధం తీవ్ర తగ్గడంతో మార్కెట్‌లో కాస్త రిలీఫ్‌ కన్పిస్తోంది. ముఖ్యంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గణనీయంగా తగ్గడం భారత్‌ వంటి వర్ధమాన మార్కెట్లకు శుభం. బ్రెంట్‌ క్రూడ్‌ ఇపుడు 72 డాలర్ల వద్ద ఉంటోంది. డాలర్‌ బలపడటంతో క్రూడ్‌ పతనం జోరుగా ఉంది. అలాగే బులియన్‌ బలహీనడపుతోంది. ఇక ఆసియా మార్కెట్లు కూడా గ్రీన్‌లో ఉన్నాయి. ఒక్క హాంగ్‌సెంగ్‌ మాత్రమే బలహీనంగా ఉంది. జపాన్‌ నిక్కీతో పాటు ఇతర మార్కెట్లు గ్రీన్లో ఉన్నాయి. గిఫ్ట్‌ నిఫ్టి గ్రీన్‌లో 60 పాయింట్ల లాభంతో ఉంది. చూస్తుంటే మార్కెట్‌ ఇవాళ్టి నుంచి గ్రీన్‌లో కొనసాగే అవకాశాలే అధికంగా కన్పిస్తోంది. డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ గురువారం. ఈలోగా షార్ట్‌కవరింగ్‌ వచ్చే ఛాన్స్‌ ఉందని అనలిస్టులు అంటున్నారు.