డబుల్ ధమాకా!
వారీ ఎనర్జీస్ షేర్ రేపు స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కానుంది. మార్కెట్ నుంచి రూ.4321 కోట్లు సమీకరించేందుకు ఈ కంపెనీ ఇటీవల పబ్లిక్ ఆఫర్ చేసిన విషయం తెలిసిందే. ఒక్కో షేర్‌ను రూ. 1,503లకు కంపెనీ ఆఫర్ చేసింది. మొన్నటి వరకు గ్రే మార్కెట్‌లో ఈ షేర్ ప్రీమియం వంద శాతం ఉండేది. అంటే షేర్ లిస్టింగ్ రూ. 3000పైనే ఉంటుందని గ్రే మార్కెట్ అంచనా. అయితే రేపు లిస్టింగ్ అనగా… ఇవాళ గ్రే మార్కెట్ ప్రీమియం స్వల్పంగా తగ్గి 80 లేదా 85 శాతం పలుకుతోంది. అయితే రేపు కచ్చితంగా రెట్టింపు ధరతో లిస్ట్ అవుతుందని చాలా మంది అనలిస్టులు అంచనా వేస్తున్నారు. సంస్థాగత ఇన్వెస్టర్ల కేటగిరి 208 రెట్లు ఓవర్ సబ్‌స్క్రయిబ్ అయింది. షేర్లు అలాట్ కానివారు ఓపెన్ మార్కెట్ కొనే అవకాశాలు అధికంగా ఉన్నాయని అనలిస్టులు అంటున్నారు.