టార్గెట్ రూ. 110
ఒలా ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ షేర్ టార్గెట్‌ను రూ. 110గా హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ రీసెర్చి పేర్కొంది. ఇది అధిక ప్రతిఫలం ఇచ్చే హై రిస్క్ షేర్‌ను ఈ సంస్థ హెచ్చరించింది. కంపెనీ విజయం పూర్తి ఎలక్ట్రిక్ బైక్స్ విజయంతో పాటు సొంతంగా బ్యాటరీ తయారీకి ఒలా చేస్తున్న ప్రయత్నాలపై ఆధారపడి ఉంటుందని కంపెనీ పేర్కొంది. గతంలో కూడా ఈ సంస్థ ఒలా టార్గెట్ ధరను రూ.110గా పేర్కొంది. ఇటీవల కంపెనీ తయారీ ప్లాంట్‌ను ఈ బ్రోకరేజీ సంస్థ ప్రతినిధులు సందర్శించారు. వాహనాల్లో మున్ముందు సమస్యలు రాకుండా అక్కడ జరుగుతున్న ప్రయత్నాలు వీరు చూశారు. అలాగే భారీ ఎత్తున మెకానిక్‌లను రిక్రూట్ చేసుకున్నారని హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ పేర్కొంది. అలాగే సొంతంగా బ్యాటరీ తయారీ కోసం కంపెనీ చేస్తున్న ప్రయత్నాలను కూడా తాము చూశామని వెల్లడించింది.