For Money

Business News

ఇవాళ్టి పాపం ఇండస్‌ది

మార్కెట్‌ ఎంత బలహీనంగా ఉందంటే… కుప్పకూలడానికి ఒక్క కారణం చాలు. ఇవాళ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఒక్క షేర్‌ మొత్తం మార్కెట్‌ మూడ్‌ను మార్చేసింది. ఇప్పటికే బజాజ్‌ ఆటో గైడెన్స్‌తో డల్‌గా ఉన్న మార్కెట్‌కు హెచ్‌యూఎల్‌ షాక్‌ ఇచ్చింది. ఇపుడు ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ మార్కెట్‌ నమ్మకాన్ని దెబ్బతీసింది. ఆర్థిక వ్యవస్థ చాలా డల్‌గా ఉందని, ప్రభుత్వం చెబుతున్న వృద్ధి రేటు బోగస్‌ అని… 7 శాతం వృద్ధి రేటు సాధ్యం కాదని గణాంకాలు చెబుతున్నాయి. కంపెనీల ఫలితాలు చెబుతున్నాయి. ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఫలితాలు చాలా చెత్తగా ఉండటంతో షేర్‌ 20 శాతం క్షీణించింది. చివర్లో స్వల్పంగా కోలుకుని 18.99 శాతం నష్టంతో ముగిసింది. ఈ షేర్‌ దెబ్బకు మొత్తం బ్యాంకింగ్‌, ఎన్‌బీఎఫ్‌సీ షేర్లలో భారీ ఒత్తిడి వచ్చింది. ఒక్క ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ మినహా దాదాపు అన్ని ప్రధాన సూచీలు ఇవాళ నష్టాలతో ముగిశాయి. నష్టాల్లో ఉన్న షేర్లు 2200 పైగా ఉండగా లాభాల్లోఉన్న 320 దాకా ఉన్నాయి. నిఫ్టిలో కూడా 12 షేర్లే గ్రీన్‌లో ఉన్నాయి. ఆ లాభాలు కూడా నామమాత్రమే. ఇవాళ్టి టాప్‌ గెయినర్స్‌లో ఐటీసీ ఉండగా, యాక్సిస్‌ బ్యాంక్‌, బీఈఎల్‌, బ్రిటానియా, హిందుస్థాన్‌ లీవర్‌ మిగిలిన స్థాయిల్లో ఉన్నాయి. ఒక నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ టాప్‌లో ఉంది. తరవాతి స్థానంలో ఉన్న అదానీ ఎంటర్‌ప్రైజస్‌ 5 శాతం క్షీణించగా, మూడో స్థానంలో ఉన్న బీపీసీఎల్‌ కూడా 4.8 శాతం నష్టపోయింది,. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ నాలుగు శాతం, కోల్‌ ఇండియా మూడున్నర శాతం నష్టపోయింది.