For Money

Business News

ఆర్డర్‌ పెడితే రూ.10 ఫీజు

దీపావళి ధమాకా. నిజమే కాకపోతే కంపెనీలకు. కస్టమర్లకు మాత్రం నెత్తిన మరో భారం. ఆన్‌లైన్‌ ఫుడ్‌కు అలవాటు పడిన కస్టమర్లను దోచుకోవడం మొదలైంది. గతంలో ఫ్రీగా వస్తువులు డెలివరీ చేసిన ఈ కామర్స్‌ కంపెనీలు స్విగ్గీ, జొమాటొ ఇపుడు ప్లాట్‌ఫామ్‌ ఫీజు అంటూ భారీ భారం వేస్తున్నాయి. జొమాటొ తన ప్లాట్‌ఫామ్‌ ఫీజును నిన్నటి నుంచి రూ.10 చేసింది. అంటే ప్రతి ఆర్డర్‌పైనా రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. ఇవాళ్టి నుంచి స్విగ్గీ కూడా ప్లాట్‌ఫామ్‌ ధరలు పెంచింది. ప్రస్తుతం ఈ కంపెనీ రూ. 7 వసూలు చేస్తోంది. ఉచితంగా సేవలు అందించే జొమాటొ తొలిసారి 2023 ఆగస్టులో ప్లాట్‌ఫామ్‌ ఫీజు రూ. 2 అంటూ భారం వేయడం ప్రారంభించింది. తరవాత 2024 జనవరిలో రూ.4 చేసింది. ఆ తరవాత ఏకంగా రూ. 10 చేసింది. స్విగ్గీ కూడా మొన్నటి దాకా రూ. 6 చార్జి చేసేది. ఇపుడు ఏకంగా పది రూపాయలకు పెంచింది. ప్రీమియం కస్టమర్లు కూడా ఎలాంటి తగ్గింపు ఇవ్వకపోవడంతో… ఆర్డర్‌ పెడితే రూ.10 చెల్లించే పరిస్థితి ఏర్పడింది. ప్లాట్‌ఫామ్‌ ఫీజు నగరాలను బట్టి మారుతోందని కొందరు కస్టమర్లు సోషల్‌ మీడియాలో పోస్టు చేస్తున్నారు. హైదరాబాద్‌లో రూ.10.

Leave a Reply