లాభాలతో ప్రారంభం కానున్న నిఫ్టి
రాత్రి డాలర్ పతనం స్టాక్ మార్కెట్ ట్రెండ్‌ను మార్చేసింది. అలాగే క్రూడ్, బులియన్ మార్కెట్లు కూడా పెరిగాయి. ముఖ్యంగా క్రూడ్ ఆరు శాతం వరకు పెరిగింది. రాత్రి అమెరికా మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నాస్డాక్ ఒకటిన్నర శాతం పెరిగింది. ఎస్ అండ్ పీ 500 సూచీ కూడా ఒక శాతం పెరిగింది. డౌజోన్స్ అరశాతంపైగా లాభపడింది. ఉదయం నుంచి ఆసియా మార్కెట్లలో కూడా ఇదే ట్రెండ్ కన్పిస్తోంది. నిక్కీ ఒక శాతం వరకు పెరగ్గా, చైనా మార్కెట్ల లాభాలు అర శాతం లోపే ఉన్నాయి. హాంగ్‌సెంగ్ 1.6 శాతం పెరగ్గా, తైవాన్, సింగపూర్ సూచీలు కూడా భారీ లాభాలతో ట్రేడవుతున్నాయి. సింగపూర్ నిఫ్టి 90 పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. ఈ లెక్కన నిఫ్టి ఇవాళ ఓపెనింగ్‌లోనే 16550పైన ప్రారంభమయ్యే అవకాశముంది.