For Money

Business News

స్విగ్గీ, జెప్టొకు నోటీసులు?

దేశంలోని 11 ఈకామర్స్‌, క్విక్‌ కామర్స్‌ ప్లేయర్స్‌కు కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీపీఏ (సెంట్రల్‌ కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ -CCPA) నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సంస్థలు వినియోగదారులకు పంపిణీ చేస్తున్న వస్తువులపై తయారీ తేదీ కన్పించడం లేదని, మరికొన్ని సంస్థలు సురఫరా చేసే వస్తువులు దాదాపు ఎక్స్‌పైరీ డేట్‌ దగ్గర ఉన్నాయని పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో లీగల్ మెట్రాలజీ యాక్ట్‌ కింద మాండేటరీ డిక్లరేషన్‌ రూల్స్‌ అతిక్రమించినట్లు నోటీసులో సీసీపీఏ పేర్కొంది. లేబుల్స్‌కు సంబంధించిన పలు నిబంధనలను ఈ కంపెనీలు ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి. స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌, జెప్టొ, బ్లింకిట్‌, స్నాప్‌డీల్‌, మీషో, మైగ్లామ్‌తో మరికొన్ని కంపెనీలకు నోటీసులు జారీ అయినట్లు తెలుస్తోంది.