For Money

Business News

ఈ షేర్‌ను రూ.1750 వద్ద కొనొచ్చా?

ఇవాళ హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా షేర్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ అయింది. లిస్టింగ్‌ రోజే తీవ్ర ఒత్తిడి ఎదుర్కొన్న ఈ షేర్‌ ఎన్ఎస్‌ఈలో రూ.1845 వద్ద ముగిసింది. పబ్లిక్‌ ఆఫర్‌ సమయంలో ఈ షేర్‌కు చాలా మంది విశ్లేషకులు, ఇన్వెస్టరర్లు దేశభక్తిని జోడించి నెగిటివ్‌ ప్రచారం చేశారు. ఈ షేర్‌కు రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి కేవలం 50 శాతం స్పందన మాత్రమే వచ్చింది. ఇవాళ కూడా తీవ్ర అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అయితే పలు బ్రోకరేజీ సంస్థలు ఈ షేర్‌పై కవరేజీని ప్రారంభించాయి. ఎమ్కే బ్రోకరేజీ సంస్థ ఈ షేర్‌ టార్గెట్‌ ధరను రూ. 1750గా పేర్కొంది. అంటే ఈ ధర వద్ద ఈ షేర్‌ను కొనుగోలు చేయడం సమంజసంగా ఆ కంపెనీ పేర్కొంది. కంపెనీ భవిష్యత్‌ పనితీరును అంచనా వేసి ఈ షేర్‌ వాస్తవ విలువను రూ. 1750గా పేర్కొంది. అంటే ఇవాళ్టి ధరతో పోలిస్తే మరో వంద రూపాయలు తగ్గితే కొనుగోలు చేయొచ్చన్నమాట. అయితే నొమురా బ్రోకరేజీ సంస్థ మాత్రం ఈ షేర్‌ను కొనుగోలు చేయొచ్చని సలహా ఇస్తోంది. ఈ కంపెనీ ప్రీమియం సెగ్మంట్‌లో ఉండటం వల్ల ఇతర కంపెనీల కంటే మెరుగైన వార్షిక వృద్ధి రేటు సాధిస్తుందని నొమురా అంటోంది. ఈ బ్రోకింగ్ సంస్థ హ్యందాయ్‌ మోటార్‌ ఇండియా టార్గెట్ ధరను రూ. 2,472గా పేర్కొంది. ప్రస్తుతం ప్రతి 1000 మందికి సగటున కేవలం 36 మందికి మాత్రమే కార్లు ఉన్నాయని… ఈ మార్కెట్‌కు మంచి భవిష్యత్తు ఉందని నొమురా అంటోంది. 2025-27 మధ్యకాలంలో ఈ కంపెనీ 8 శాతం వృద్ధి రేటు సాధిస్తుందని అంచనా వేసింది. ఈ కాలంలో ఏడు నుంచి ఎనిమిది కొత్త మోడల్స్‌ను తీసుకు వస్తుందని లేదా ఉన్న మోడల్స్‌ను మెరుగుపరుస్తుందని నొమురా అంటోంది. అలాగే ఎబిటా మార్జిన్‌ కూడా 13.1 శాతం నుంచి 14 శాతానికి చేరుతుందని పేర్కొంది. మరో బ్రోకింగ్‌ సంస్థ మక్వెరి కూడా హ్యుందాయ్‌ షేర్‌ టార్గెట్‌ ధరను రూ. 2,235గా వెల్లడించింది.

Leave a Reply