80% పెరిగిన నికర లాభం
సెప్టెంబర్ నెలతో ముగిసిన త్రైమాసికంలో బజాజ్ ఫైనాన్స్ అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 80 శాతం పెరిగింది. కంపెనీ స్టాండ్ అలోన్ నికర లాభం రూ. 3105 కోట్ల నుంచి రూ. 5,614 కోట్లకు చేరింది. అదే కన్సాలిడేటెడ్ పద్ధతిలో చూస్తే 13 శాతం పెరిగి రూ. 3551 కోట్ల నుంచి రూ. 4000 కోట్లకు చేరింది. కంపెనీ ఆదాయం కూడా రూ. 11410 కోట్ల నుంచి రూ. 14487 కోట్లకు పెరిగింది. ఏయూఎం రూ. 2,90,264 కోట్ల నుంచి రూ. 3,73,954 కోట్లకు పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది. కొత్త రుణాల సంఖ్య కూడా 14 శాతం పెరిగి 85.3 లక్షల నుంచి 96.9 లక్షలకు చేరింది. నికర ఆదాయం 23 శాతం పెరిగి రూ. 7196 కోట్ల నుంచి రూ. 8838 కోట్లకు చేరింది.