For Money

Business News

అయ్యో….హ్యుందాయ్‌

లిస్టింగ్‌ రోజున హ్యుందాయ్‌ మోటార్స్‌ ఆఫర్‌ ధర తళుక్కుమని కొన్ని సెకన్లు మాత్రమే కన్పించింది. తరవాత రోజంతా నష్టాలే. మధ్యాహ్నం వరకు స్వల్ప నష్టాలతో ఉన్న ఈ కౌంటర్‌లో తరవాత భారీగా అమ్మకాల ఒత్తిడి వచ్చింది. పబ్లిక్‌ ఆఫర్‌లో గరిష్ఠ స్థాయి అయిన రూ. 1960లకు కంపెనీ షేర్లను ఆఫర్‌ చేసింది. ఇవాళ ఉదయం ఆరంభంలోనే రూ. 1934 వద్ద అంటే నష్టాల్లో ఈ షేర్‌ లిస్టయింది. తరవాత రూ. 1970లకు చేరినా.. అక్కడ ఎంతోసేపు నిలబడలేదు. అమ్మకాల ఒత్తిడి అధికం కావడంతో 3 గంటల తరవాత రూ.1807ను తాకిన ఈ షేర్‌ క్లోజింగ్‌లోరూ. 1845 వద్ద ముగిసింది. ఆఫర్‌ ధరతో పోలిస్తే ఇన్వెస్టర్లు 4.6 శాతం నష్టపోయారు. ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో మొత్తం రూ.5,404 కోట్ల విలువైన లావాదేవీలు జరిగాయి.