For Money

Business News

నిరాశపర్చిన లిస్టింగ్‌

హ్యుందాయ్‌ మోటార్స్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓ లిస్టింగ్‌ ఊహించినట్లే నిరాశ కల్గించింది. ఒక్కో షేరును రూ.1960 కేటాయించగా ఇవాళ ఎన్‌ఎస్‌ఈలో రూ. 1934 వద్ద ఓపెనైంది. వెంటనే ఈ షేర్‌ రూ. 1844ను తాకింది. అక్కడి నుంచి కోలుకుని ఇపుడు రూ.1907 వద్ద ట్రేడవుతోంది. బీఎస్‌ఈలో 1.48శాతం డిస్కౌంట్‌తో రూ.1,931 షేర్లు లిస్టయ్యాయి. పబ్లిక్‌ ఆఫర్‌ ఈనెల 17న ముగిసిన విషయం తెలిసింది.ఈ ఆఫర్‌ ద్వారా కంపెనీ రూ.27,870 కోట్లు సమీకరించింది.