For Money

Business News

నష్టాలతో ఆరంభం

వాల్‌స్ట్రీట్‌ నష్టాతో ప్రారంభమైంది. ముఖ్యంగా డౌజోన్స్‌ బలహీనంగా మొదలైంది. అధ్యక్ష ఎన్నికల ప్రభావం అమెరికా బ్యాంకులపై ఉంటందంటూ బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా పేర్కొనడంతో డౌజోన్స్‌పై ఒత్తిడి పెరిగింది. పైగా ఇవాళ డాలర్‌తో పాటు బాండ్‌ ఈల్డ్స్‌ బాగా పెరిగాయి. డాలర్‌ ఇండెక్స్ అరశాతం పెరిగి 104కు చేరువు అవుతోంది. ఇదే సమయంలో పదేళ్ళ, 20 ఏళ్ళు, 30 ఏళ్ళ బాండ్‌ ఈల్డ్స్‌ 2 శాతంపైగా పెరిగాయి. దీంతో వాల్‌స్ట్రీట్‌ బలహీనంగా ఉంది. అయితే ఐటీ, టెక్‌ షేర్లు నామమాత్రపు నష్టాలతో ట్రేడవుతున్నాయి. నాస్‌డాక్‌ ప్రస్తుతం 0.17 శాతం నష్టంతో ఉంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.42 శాతం నష్టంతో ట్రేడవుతోంది. క్రూడ్‌ ధరలు ఒకటిన్నర శాతం పెరిగినా బ్రెంట్‌ క్రూడ్‌ 75 డాలర్ల లోపే ఉంది. అయితే బులియన్‌ మార్కెట్‌లో జోరు కన్పిస్తోంది. డాలర్‌ పెరిగినా సిల్వర్‌ రెండు శాతం పెరిగింది. బంగారం మాత్రం స్వల్ప లాభాలకే పరిమితమైంది. ప్రస్తుతం ఔన్స్‌ బంగారం ధర 2735 డాలర్ల వద్ద ఉంది.