For Money

Business News

రద్దయిన పాలసీల పునరుద్ధరణ

ప్రీమియం చెల్లించలేక రద్దయిన (లాప్స్‌డ్‌) పాలసీల పునరుద్ధరణకు ఎల్‌ఐసీ అవకాశం కల్పించింది
ఈ నెల 23న ప్రారంభమైన ఈ ప్రక్రియ అక్టోబరు 22 వరకు కొనసాగుతుంది. ఈ పాలసీల ప్రీమియం బకాయిల చెల్లింపులకు సంబంధించి పాలసీదారులకు లేట్‌ ఫీజులో 20 నుంచి 30 శాతం వరకు రాయితీ కల్పించింది. అయితే ఈ రాయితీ రూ.2,000 నుంచి రూ.3,000 పరిమితికి లోబడి ఉంటుందని ఎల్‌ఐసీ తెలిపింది. కొన్ని షరతులకు లోబడి ప్రీమియం చెల్లించడం ఆపేసిన ఐదేళ్ల లోపు పాలసీలకు ఈ సడలింపు వర్తిస్తుంది.

ముఖ్యాంశాలు..

  • ప్రీమియం చెల్లించడం ఆపేసే నాటికి ఆ పాలసీ కాలపరిమితి పూర్తి కాకూడదు
  • టర్మ్‌ పాలసీలు, మల్టిపుల్‌ రిస్క్‌ పాలసీలకు ఈ పునరుద్ధరణ వర్తించదు
  • హెల్త్‌, మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీల పునరుద్ధరణకూ లేటు ఫీజులో రాయితీ
  • వైద్య పరీక్షల్లో ఎలాంటి మినహాయింపు ఉండదు
  • ప్రీమియం బకాయి రూ.లక్ష వరకు ఉంటే రూ.2,000 పరిమితికి లోబడి 20 శాతం వరకు రాయితీ
  • రూ.లక్ష నుంచి రూ.3 లక్షల లోపు ఉంటే రూ.2,500 పరిమితికి లోబడి 25 శాతం వరకు రాయితీ
  • రూ.3 లక్షలకు మించి బకాయి ఉంటే రూ.3,000 పరిమితికి లోబడి 30 శాతం వరకు రాయితీ