వాల్‌స్ట్రీట్‌కు యూరో బూస్ట్
ప్రపంచ మార్కెట్లలో ముఖ్యంగా యూరో, అమెరికా మార్కెట్లలో ఈక్విటీ షేర్ల ర్యాలీ కొనసాగుతోంది. తైవాన్ సెమి కండక్టర్ కంపెనీ టీఎస్‌ఎం అంచనాలకు మించిన పనితీరు కనబర్చడంతో ఆ రంగానికి చెందిన టెక్ షేర్లు ఆకర్షణీయ లాభాల్లో ఉన్నాయి. దీంతో నాస్‌డాక్ అరశాతంపఐగా లాభంతో ట్రేడవుతోంది. ఎస్ అండ్ పీ 500తో పాటు డౌజోన్స్ కూడా లాభాల్లో ట్రేడవుతున్నాయి. కార్పొరేట్ ఫలితాలతో పాటు ఇతర ఎకనామిక్ డేటా వాల్‌స్ట్రీట్‌కు అనుకూలంగా ఉన్నాయి. మరోవైపు ఈ ఏడాది మూడోసారి యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించింది. వడ్డీ రేట్లు పావు శాతం తగ్గడంతో యూరో మార్కెట్లన్నీ లాభాల్లో క్లోజయ్యాయి. దీంతో వాల్‌స్ట్రీట్ సెంటిమెంట్ మరింత బలపడింది. ఇక డాలర్ విషయానికొస్తే… గ్రీన్‌లో ఉన్నా 103పైన డాలర్ ఇండెక్స్ స్థిరంగా ఉంది. క్రూడ్ ధరలు స్థిరంగా ఉన్నా.. .రెడ్‌లో కొనసాగుతున్నాయి. ఒక బులియన్ మార్కెట్ కూడా క్రితం ధరల వద్దే ట్రేడవుతున్నాయి.