For Money

Business News

రేపు నిఫ్టికి అగ్నిపరీక్ష

ఇప్పటి వరకు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న నిఫ్టి రేపు ముఖ్యమైన అగ్నిపరీక్షను ఎదుర్కోనుంది. ఇవాళ 24,749 వద్ద క్లోజైన నిఫ్టి… రేపు అంటే శుక్రవారం కచ్చితంగా 24700 స్థాయిని కాపాడుకోవాల్సి ఉంది. ఒకవేళ నిఫ్టి గనుక నష్టాల్లో ముగిస్తే మాత్రం… 2024లో తొలిసారి వరుసగా మూడు వారాలు నిఫ్టి నష్టాల్లో ముగిసినట్లు అవుతుంది. పైగా 24,700 స్థాయిని బ్రేక్‌ చేస్తే 24500, ఆ తరవాత 24200 స్థాయికి గేట్లు తెరచినట్లు. చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా విదేశీ ఇన్వెస్టర్లు అమ్ముతున్నారు. ఈనెల ప్రతిరోజూ క్యాష్‌ మార్కెట్‌లో నికరంగా వీరు అమ్ముతున్నారు. ఇవాళ కూడా రూ. 7,421 కోట్ల విలువైన షేర్లను నికరంగా అమ్మారు. దేశీయ ఆర్థిక సంస్థలు కొనుగోలు చేస్తున్నా… మార్కెట్‌ కీలక స్థాయిలను కోల్పోతే… రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి కూడా ఒత్తిడి వచ్చే అవకాశముంది. ఇప్పటి వరకు మార్కెట్‌కు ఐటీ షేర్లు అండగా ఉన్నాయి. ఇవాళ ఫలితాలు ప్రకటించిన ఇన్ఫోసిస్‌, విప్రో షేర్లు రేపటి ట్రేడింగ్‌లో కీలకం కానున్నాయి. ఎందుకంటే ఈ షేర్ల ఏడీఆర్‌లు ఇప్పటికే అమెరికా మార్కెట్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఫలితాలు బాగున్నాయని భారత అనలిస్టులు అంటున్నా… అమెరికాలో నెగిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. క్లోజింగ్ సమయానికి ఈరెండు షేర్లు కోలుకుంటాయేమో చూడాలి. ఎఫ్‌ఎంసీజీ, మెటల్‌, రియాల్టి షేర్లతో పాటు స్పెషాలిటీ కెమికల్స్ షేర్లు కూడా ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ ఫలితాలు బాగుండటంతో… రేపు నిఫ్టికి బ్యాంక్‌ నిఫ్టి బలాన్ని ఇస్తుందేమో చూడాలి. నిఫ్టి రేపు డబుల్‌ బాటమ్‌ను ఏర్పరిస్తే… రికవరీకి ఛాన్స్‌ ఉంది. అదీ కూడా 25200 వరకు. మరి నవంబర్‌ సిరీస్‌కు వచ్చే వారం చాలా కీలకం కానుంది కూడా.

Leave a Reply