For Money

Business News

గైడెన్స్‌ పెంచిన ఇన్ఫోసిస్‌

ఇన్ఫోసిస్‌ కంపెనీ పూర్తి ఏడాదికి రెవెన్యూ గైడెన్స్‌ పెంచింది. వృద్ధి రేటు మూడు నుంచి నాలుగు శాతం వరకు ఉంటుందని గతంలో పేర్కొన్న కంపెనీ… ఈసారి గైడెన్స్‌ను పెంచింది. ఈ ఏడాదికి రెవెన్యూ వృద్ధి రేటు 3.75 శాతం నుంచి 4.5 శాతం వరకు ఉండే అవకాశముందని పేర్కొంది. అలాగే మార్జిన్స్‌ కూడా 20 శాతం నుంచి 22 శాతం ఉంటాయని పేర్కొంది. ఇక సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో కంపెనీ రూ.6,506 కోట్ల నికర లాభాన్ని అర్జించింది. గతేడాది ఇదే సమయంలో నమోదైన రూ.6,212 కోట్లతో పోలిస్తే 4.7 శాతం వృద్ధి చెందింది. అదే సమయంలో కంపెనీ ఆదాయం 4.2 శాతం పెరిగి రూ.40,986 కోట్లకు చేరిందని కంపెనీ తన స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. జూన్‌తో ముగిసిన త్రైమాసికంతో పోలిస్తే కంపెనీ నికర లాభం 2.2 శాతం, ఆదాయం 4.3 శాతం పెరిగింది. ఎబిటా కూడా 4.4 శాతం మేర పెరిగిందని కంపెనీ పేర్కొంది. మార్జిన్‌ మాత్రం 21.1 శాతంగానే కొనసాగనుంది. ఈ సందర్భంగా వాటాదారులకు ఒక్కో షేర్‌కు రూ. 21 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ ఇవ్వాలని కంపెనీ నిర్ణయించింది. రికార్డు తేదీ అక్టోబర్‌ 29. ప్రస్తుత త్రైమాసికంలో 240 కోట్ల డాలర్ల డీల్స్‌ వచ్చినట్లు కంపెనీ పేర్కొంది.

Leave a Reply