For Money

Business News

బజాజ్‌ దెబ్బ జోరుగా…

బజాజ్‌ గ్రూప్‌ అంటే కార్పొరేట్‌ రంగంలో ఓ ప్రత్యేకత ఉంది. అదేమిటంటే.. వారు నిజాయితీ ఉంటారు. నిజాలే మాట్లాడుతారని. నిష్టూరంగా ఉన్నా. వారి స్టయిల్‌ అంతే. ఇవాళ బజాజ్‌ ఆటో ఫలితాలు ప్రకటించింది. అమ్మకాలు అప్‌. నికర లాభం అప్‌. మార్జిన్‌ పెరిగింది. ఎబిటా కూడా పెరిగింది. అయితే ఈ ఏడాదిలో కంపెనీ వృద్ధి రేటు 5 శాతం నుంచి 8 శాతం దాకా ఉంటుందని అన్న బజాజ్‌ కంపెనీ… ఇవాళ తన అంచనాలను సవరించింది. కేవలం 5 శాతం మాత్రమే వృద్ధి ఉంటుందని పేర్కొంది. పండుగ సీజన్‌లో కూడా అమ్మకాలు ఒకట్రెండు శాతం పెరుగుతాయని చెప్పలేమని అన్న బజాజ్‌ ప్రకటన మార్కెట్‌ను కుదిపేసింది. ఆటో కంపెనీలతో పాటు ఎంఎఫ్‌సీజీ కంపెనీల షేర్లు కుప్పకూలాయి. బజాజ్‌ ఆటో ఏకంగా 12 శాతం దాకా క్షీణించింది. శ్రీరామ్‌ ఫైనాన్స్‌ 4 శాతం తగ్గింది. ఇతర ఆటోలతో పాటు ఫైనాన్స్‌ కంపెనీలు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి. నెస్లే కూడా 3.4 శాతం పడిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. హావెల్స్‌ కూడా. ఉదయం నుంచి మార్కెట్‌ పడుతూనే ఉంది. మధ్యలో వచ్చిన ఆర్థిక ఫలితాలు కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. నిఫ్టి పెద్దగా పడకున్నా… ఇతర రంగాల షేర్లు భారీగా క్షీణించాయి. నిఫ్టి 221 పాయింట్ల నష్టంతో 24,749 పాయింట్ల వద్ద ముగిసింది. గరిష్ఠ స్థాయి నుంచి దాదాపు 300 పాయింట్లు క్షీణించింది. నిఫ్టి డెరివేటివ్స్‌ వీక్లీ క్లోజింగ్‌ నేడు. దీంతో నిఫ్టి ఇవాళ 0.89 శాతం క్షీణించగా, సెన్సెక్స్ మాత్రం 0.6 శాతం క్షీణించింది. ఇవాళ ఒక్క ఐటీ సూచీ మినహా మిగిలిన అన్ని ప్రధాన సూచీలు పడ్డాయి. అత్యధికంగా ఆటో రంగ సూచీ మూడు శాతం క్షీణించింది. ఇవాళ ఐటీ షేర్లలో ఇన్ఫోసిస్‌ 2.84 శాతం లాభంతో నిఫ్టి టాప్‌ గెయినర్‌గా నిలిచింది. ఇంకా టెక్‌ మహీంద్రా, పవర్‌ గ్రిడ్‌, ఎల్‌ అండ్‌ టీ, ఎస్‌బీఐ షేర్లు టాప్‌ ఎయినర్స్‌లో నిలిచాయి.