For Money

Business News

రెండో రోజు నాటికి 42 %

హ్యుందాయ్‌ ఇండియా పబ్లిక్‌ ఆఫర్‌ రెండో రోజు నాటికి 42 శాతం సబ్‌స్క్రియబ్‌ అయింది. మార్కెట్‌ నుంచి రూ. 27,870 కోట్ల సమీకరించేందుకు ఉద్దేంచిన ఈ ఇష్యూ రేపటితో ముగియనుంది. 9.97 కోట్ల షేర్లను ఆఫర్‌ చేస్తుండగా బుధవారం నాటికి 4.17 కోట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. రీటైల్‌ విభాగానికి కేటాయించిన షేర్లలో 38 శాతం సబ్‌స్క్రయిబ్‌ అయింది. నాన్‌ ఇన్‌స్టిట్యూషన్‌ ఇన్వెస్టర్ల వాటా కేవలం 26 శాతం మాత్రమే ఆదరణ లభించింది. క్యూఐబీల కోసం కేటాయించిన వాటాలో 58 శాతం సబ్‌స్క్రయిబ్‌ అయింది. వీరికి 2.8 కోట్ల షేర్లు కేటాయించగా 1.63 క ఓట్ల షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. ఈ ఆఫర్‌ షేర్‌ ధరల శ్రేణి రూ. 1865- రూ. 1960. అయితే చాలా మంది అనలిస్టులు దీర్ఘకాలిక లాభాల కోసమే ఈ ఇష్యూకు దరఖాస్తు చేయాలని సలహా ఇస్తున్నారు. దీంతో ఇన్వెస్టర్ల ఆసక్తి తగ్గింది. గ్రే మార్కెట్‌లో ప్రీమియం కూడా గణనీయంగా తగ్గింది. ఆఫర్‌ ధరలో కేవలం 1.6 శాతం మాత్రమే ప్రీమియం నడుస్తోందని మార్కెట్‌ వర్గాలు అంటున్నాయి.

Leave a Reply