21 నుంచి మరో ఆకర్షణీయ ఐపీఓ
సోలార్ ప్యానెల్ తయారీ రంగంలో నిమగ్నమైన వారీ ఎనర్జీస్ కంపెనీ రూ.4,321 కోట్లు సమీకరించేందుకు పబ్లిక్ ఇష్యూకు రానుంది. ఈనెల 21న సబ్స్క్రిప్షన్ ప్రారంభమై 23న ముగుస్తుంది. ఐపీఓ ధరల శ్రేణి రూ.1427-రూ.1503. ఒక లాట్లో 9 షేర్లు ఉంటాయి. ఒక్కో లాట్ కోసం రూ.13,527 వెచ్చించాల్సి ఉంటుంది. రీటైల్ ఇన్వెస్టర్లు గరిష్ఠంగా 14 లాట్లను కొనుగోలు చేయొచ్చు. ఇష్యూలో 35 శాతం వాటాను రీటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు. ఐపీఓలో భాగంగా రూ.3,600 కోట్ల విలువైన షేర్లను తాజా జారీ చేస్తారు. రూ.721.44 కోట్ల విలువైన మరో 48 లక్షల ఈక్విటీ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ప్రమోటర్లు అమ్మనున్నారు. రూ.65 కోట్ల విలువైన షేర్లను సంస్థ ఉద్యోగుల కోసం రిజర్వ్ చేశారు. ఇక క్యూఐబీలకు 50 శాతం, నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు 15 శాతం రిజర్వ్ చేశారు.
పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే నిధులను ఒడిశాలో నిర్మించనున్న 6 గిగావాట్ల సోలార్ సెల్, సోలార్ పీవీ మాడ్యూల్ మానుఫాక్చరింగ్ యూనిట్ కోసం ఖర్చు చేస్తారు. దేశంలో సోలార్ పీవీ మోడ్యూల్ తయారు చేసే కంపెనీలలో వారీ ఎనర్జీస్ అతి పెద్దది. ఈ కంపెనీకి సూరత్, టుంబ్, నందిగ్రామ్, బుల్దానా, నొయిడాలో ఐదు తయారీ యూనిట్లు ఉన్నాయి. ఈ ఏడాది జూన్ 30రాటి్ఇ ఈ కంపెనీ స్థాపక సామర్థ్యం 12 గిగావాట్లు. విదేశాల్లో కూడా ఈ కంపెనీకి కస్టమర్లు ఉన్నారు.అలాగే దేశ వ్యాప్తంగా 369 ఫ్రాంచైజీలు ఉన్నాయి.