నేటి ట్రేడింగ్ ఈ షేర్లు
మార్కెట్ బలహీనంగా ఉంది. 25000పైన నిలబడటం నిఫ్టికి కష్టంగా మారింది. ముఖ్యంగా రిలయన్స్ వంటి కంపెనీల ఫలితాలు నిరాశజనకంగా ఉండటంతో నిఫ్టిపై ఒత్తిడి పెరుగుతోంది. అయినా ఇవాళ కొన్ని షేర్లు కొనుగోలు చేయొచ్చని టెక్నికల్ అనలిస్టులు అంటున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన సీనియర్ టెక్నికల్ అనలిస్ట్ అయిన వినయ్ రజని ఇవాళ విజయా డయాగ్నస్టిక్స్‌ను కొనుగోలు చేయొచ్చని సిఫారసు చేస్తున్నారు. రూ.1,025 స్టాప్‌లాస్‌తో రూ. 1180 టార్గెట్‌తో కొనుగోలు చేయొచ్చని అన్నారు. ప్రస్తుతం ఈ షేర్ రూ. 1075 వద్ద ట్రేడవుతోంది. అలాగే మాస్టెక్‌ను కూడా కొనుగోలు చేయొచ్చిన అన్నారు. ఈ షేర్ ప్రస్తుతం రూ.2,908 వద్ద ట్రేడవుతోంది. రూ. 2750 స్టాప్‌లాస్‌తో రూ. 3150 లక్ష్యంతో కొనుగోలు చేయొచ్చని అన్నారు.
ఇక మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌కు చెందిన ఆ సంస్థ వైఎస్ ప్రెసిడెంట్ చందన్ తపారియా కూడా ఇవాళ కొన్ని షేర్లు కొనుగోలుకు సిఫారసు చేశారు.
షేర్: భారతీ ఎయిర్‌టెల్
ప్రస్తుత ధర: రూ. 1717
లక్ష్యం: రూ. 1800
స్టాప్‌లాస్ : రూ. 1680
షేర్: ఒబెరాయ్ రియాల్టి
ప్రస్తుత ధర: రూ. 2028
లక్ష్యం: రూ. 2150
స్టాప్‌లాస్ : రూ. 1970
షేర్: హెచ్‌ఏఎల్
ప్రస్తుత ధర: రూ. 4575
లక్ష్యం: రూ. 4850
స్టాప్‌లాస్ : రూ. 4430
(వివిధ మీడియా సంస్థలకు పేరెన్నిక గన్న సంస్థలకు చెందిన అనలిస్టులు ఇచ్చిన సలహాలు ఇవి. ఇవి కేవలం సమాచారం కోసమే మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు మీరు మీ మనీ మేనేజర్‌ను సంప్రదించడం మర్చిపోవద్దు.)