నష్టాల్లో నాస్‌డాక్
వరుస భారీ లాభాల తరవాత ఇవాళ వాల్‌స్ట్రీట్ నష్టాల్లో ట్రేడవుతోంది. ముఖ్యంగా కొన్ని ఐటీ కంపెనీల ఫలితాలు ఆకర్షణీయంగా లేకపోవడంతో నాస్‌డాక్ 0.7 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అయితే ఎస్ అండ్ పీ 500 మాత్రం 0.3 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఇవాళ గోల్డ్‌మ్యాన్ శాచ్స్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్ కంపెనీలు ప్రకటించిన ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. దీంతో డౌజోన్స్ కేవలం 0.22 శాతం నష్టంతో ట్రేడవుతోంది. అయితే క్రూడ్ ఇవాళ భారీగా క్షీణించడంతో ఎనర్జీ స్టాక్స్ నష్టాల్లో ఉన్నాయి. ఫలితాల తరవాత చాలా మంది ఇన్వెస్టర్లు లాభాలు స్వీకరిస్తున్నట్లు అనలిస్టులు అంటున్నారు. ఒకవేళ దిగువస్థాయిలో మద్దతు అందే పక్షంలో సూచీలు తమ నష్టాలను పూడ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. డాలర్ ఇవాళ కూడా స్థిరంగా ఉంది. డాలర్ ఇండెక్స్ 103పైనే ట్రేడవుతోంది. ఇక క్రూడ్ ధరలు నాలుగు శాతం దాకా క్షీణించాయి. డాలర్ స్వల్పంగా క్షీణించడంతో బులియన్ మార్కెట్ గ్రీన్‌లో ఉంది. వెండి, బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి.