For Money

Business News

25,200 వద్ద భారీ కాల్‌ రైటింగ్‌

మార్కెట్‌లో మళ్ళీ టెన్షన్‌ మొదైలంది. నిఫ్టి తొలి, ప్రధాన ప్రతిఘటన స్థాయిని క్రాస్‌ చేయకపోవడంతో చాలా మంది ఇన్వెస్టర్లు అధికస్థాయి వద్ద బయటపడ్డారు. దీంతో నిఫ్టి 70 పాయింట్లు నష్టపోయింది. అయితే 25,000 వద్ద గట్టి మద్దతు లభిచండంతో నిఫ్టి నష్టాలు తగ్గాయి. ప్రధానంగా నిఫ్టి 50 రోజుల EMA అయిన 20,050 స్థాయిని కాపాడుకోవడం నేటి విశేషం. డేటా బుల్‌ ఆపరేటర్లకు అనుకూలంగా ఉండటం మరో ప్లస్ పాయింట్‌.
నిఫ్టి ఇపుడు పది రోజుల, 20 రోజుల EMA (Exponential Moving Averages) మధ్య ఊగిసలాడుతోంది. 50 రోజుల EMA అయిన 25,050ని కాపడుకున్నా… వీటన్నింటిని అధిగమిస్తేనే మరో ర్యాలీకి నిఫ్టి రెడీ అవుతుందని టెక్నికల్‌ అనలిస్టులు అంటున్నారు. అధికస్థాయిలో నిఫ్టికి 25,200-25,250 వద్ద గట్టి ప్రతిఘటన ఎదురు అవుతోంది. అయితే 25,000-24,900 జోన్‌లో నిఫ్టికి మద్దతు లభిస్తోందని వీరు అంటున్నారు. ప్రస్తుత వీక్లీ ఆప్షన్‌ డేటా చూస్తే… 25,200 స్ట్రయిక్‌ చాలా కీలకంగా మారింది.ఎందుకంటే ఈ స్ట్రయిక్‌ వద్ద గరిష్ఠస్థాయిలో కాల్‌ ఆప్షన్‌ ఇంటరెస్ట్‌ ఉంది. ఆ తరవాతి స్థానంలో 26,000, 25,500,25,100 స్ట్రయిక్స్‌ ఉన్నాయి. గరిష్ఠ స్థాయిలో కాల్‌ రైటింగ్‌ కూడా 25,200 స్ట్రయిక్‌ వద్ దుంది. ఆ తరవాత అధిక కాల్‌రైటింగ్‌ 25,100, 25,500 స్ట్రయిక్స్‌ వద్ద ఉన్నాయి. ఇక పుట్‌ వైపు చూస్తే… గరిష్ట ఓపెన్‌ ఇంటరెస్ట్‌ 25,000 స్ట్రయిక్‌ వద్ద ఉంది. దీంతో మార్కెట్‌కు ఈ స్థాయిలో తక్షణ మద్దతు లభిస్తోంది. దీని తరవాత 24,500, 24,900 స్ట్రయిక్స్‌ వద్ద పుట్‌ రైటింగ్‌ ఉంది. గరిష్ఠ స్థాయిలో పుట్‌ రైటింగ్‌ 24,500 స్ట్రయిక్‌ వద్ద, ఆ తరవాత 24,400, 25,200 స్ట్రయిక్స్‌ వద్ద ఉన్నాయి.

 

Leave a Reply