For Money

Business News

తొలిరోజు సబ్‌స్క్రిప్షన్‌ 18%

హ్యుందాయ్‌ మోటార్‌ ఇండియా లిమిటెడ్‌ ఐపీఓకు తొలిరోజు ఓ మోస్తరు ఆదరణ లభించింది. మొత్తమ్మీద తొలి రోజు ఆఫర్‌ 18 శాతం సబ్‌స్క్రిప్షన్‌ అయింది. తొలి రోజు 1.77 కోట్ల షేర్లకు బిడ్లు రాగా రీటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి ఆదరణ బాగుంది. ఈ విభాగానికి కేటాయించిన షేర్లలో 26 శాతం సబ్‌స్క్రయిబ్‌ కాగా, నాన్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన షేర్లలో 13 శాతం షేర్లకు దరఖాస్తులు వచ్చాయి. క్యూఐబీ కోటా కింద 5 శాతం షేర్లకు సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. మొత్తమ్మీద తొలి సబ్‌స్క్రిప్షన్‌ 18 శాతం. సాధారణంగా క్యూఐబీతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్లు ఇష్యూ చివరి రోజున దరఖాస్తు చేస్తారు. ఇక ఉద్యోగుల కోసం కేటాయించిన వాటాలో 80 శాతం సబ్‌స్క్రిప్షన్‌ వచ్చింది. ఈ ఆఫర్‌ ఫర్‌ సేల్‌ కింద 9.97 కోట్ల షేర్లను విక్రయించి రూ.27,870 కోట్లను సమీకరించనుంది. ఈ ఐపీఓ ఎల్లుండి అంటే ఈ నెల 17తో ముగుస్తుంది. సోమవారం యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి గరిష్ఠ దరకు రూ.8315 కోట్లను కంపెనీ సమీకరించింది. ఐపీఓలో భాగంగా రూ.10 ముఖవిలువ కలిగిన షేరుకు ధరల శ్రేణి రూ.1,865-1,960గా కంపెనీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రీటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్‌కు అంటే 7 షేర్లకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. గరిష్ఠంగా 14 లాట్లకు దరఖాస్తు చేసుకోవచ్చు.

Leave a Reply