For Money

Business News

మారుతిపై రూ.200 కోట్ల ఫైన్‌

మారుతి సుజుకిపై కాంపిటిషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) సోమవారం రూ. 200 కోట్ల జరిమానా విధించింది.
వినియోగదారులకు డీలర్లు అధికంగా డిస్కౌంట్లు, ఇతర రాయితీలు ఇవ్వకుండా మారుతీ కంపెనీ నియంత్రించిందని కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. డిస్కౌంట్‌ కంట్రోల్‌ పద్ధతి సరికాదని పేర్కొంది. కార్ల డీలర్లు ఇచ్చే రాయితీలపై ఈ కంపెనీ పరిమితులు విధిస్తోందంటూ 2019 నుంచే మారుతి సుజుకిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఒత్తిడి కనుక లేకుంటే వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు లభిస్తాయని సీసీఐ పేర్కొంది. ఈ ఆరోపణలను మారుతి సుజుకి గతంలోనే కొట్టిపడేసింది. తామెప్పుడూ ఇలా ఒత్తిడి చేయలేదని వివరణ ఇచ్చింది. ఎవరైనా డీలర్లు అధిక డిస్కౌంట్‌ ఇస్తున్నారేమో కనుగొనేందుకు మారుతీ కంపెనీ మిస్టరీ షాపింగ్‌ ఏజెన్సీలను ఏర్పాటు చేసిందని సీసీఐ పేర్కొంది. రూ. 200 కోట్ల జరిమానాను రెండు నెలల్లోగా చెల్లించాలని ఆదేశించింది.