For Money

Business News

నేటి నుంచి హ్యుండాయ్‌ ఐపీఓ

దేశ స్టాక్‌ మార్కెట్‌ చరిత్రలో అతి పెద్ద పబ్లిక్‌ ఆఫర్‌ ఇవాళ ప్రారంభం కానుంది. దక్షిణ కొరియా కంపెనీ హ్యుందాయ్‌ చెందిన భారత అనుబంధ సంస్థ హ్యుందాయ్‌ మోటార్ ఇండియా ఐపీఓ సబ్‌స్క్రిప్షన్ ఇవాళ ప్రారంభమై 17న ముగుస్తుంది. గరిష్ఠ ధర వద్ద నిన్న యాంకర్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.8,315.28 కోట్లను కంపెనీ సమీకరించనుంది. ప్రస్తుత ఆఫర్‌ కింద 14.22 కోట్ల షేర్లను జారీ చేసి మొత్తం రూ.27,870.16 కోట్లను సమీకరించనుంది. ఈ ఆఫర్‌లో కొత్త షేర్ల జారీ ఉండదు. దక్షిణ కొరియాకు చెందిన హ్యుందాయ్ మోటార్ కంపెనీకి హ్యుందాయ్ మోటార్ ఇండియా వంద శాతం అనుబంధ సంస్థ. ఈ ఆఫర్‌ తర్వాత ఇండియా కంపెనీలో మాతృ సంస్థ వాటా 82.5%కి తగ్గుతుంది. అంటే ప్రమోటర్ కంపెనీ ఆఫర్ ఫర్ సేల్‌ కింద 17.5% వాటాలను విక్రయిస్తోంది. తన ఉద్యోగులకు ఇష్యూ ధరపై రూ.186 తగ్గింపు ఇస్తోంది కంపెనీ. ఈ కంపెనీ ప్రైస్ బ్యాండ్ ఒక్కో షేరుకు రూ.1,865-1,960గా నిర్ణయించిన విషయం తెలిసిందే. లాట్ కింద 7 షేర్లు జారీ చేస్తారు. కనీసం ఒక లాట్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అంటే కనీస పెట్టుబడి రూ.13,720 అన్నమాట. స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో ఈ షేర్‌ ఈనెల 22న లిస్ట్‌ అవుతుంది. కనీసం ఏడాది పాటు ఉంచుకోవడానికైతే ఈ షేర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎందుకంటే తక్షణ లాభం అంటే లిస్టింగ్‌ లాభం పెద్దగా ఉండకపోవచ్చు. గ్రే మార్కెట్‌లో ఈ షేర్‌ ప్రీమియం కేవలం రూ. 35 మాత్రమే. మరి లిస్టింగ్‌ రోజు అధిక ప్రీమియం లభిస్తుందేమో చూడాలి.

Leave a Reply