కొనసాగుతున్న ర్యాలీ
వాల్‌స్ట్రీట్‌లో ఈక్విటీ ర్యాలీ కొనసాగుతోంది. ఎస్ అండ్ పీ 500తో పాటు డౌజోన్స్ సూచీలు కొత్త ఆల్‌టైమ్ రికార్డు స్థాయిల వద్ద ట్రేడవుతున్నాయి. ఇవాళ నాస్‌డాక్ 0.88 వాతం, ఎస్ అండ్ పీ 500 సూచీ 0.76 శాతం లాభంతో ట్రేడవుతుండగా, డౌజోన్స్ 0.46 శాతంతో ఉంది.ప్రధాన టెక్ షేర్లలో ఎన్‌విడియా ఇవాళ మరో రెండు శాతంపైగా లాభంతో ట్రేడవుతోంది. ఇవాళ డాలర్ మరింత పెరిగింది. డాలర్ ఇండెక్స్ చాన్నాళ్ళ తరవాత 103ని దాటింది. ఫలితంగా కమాడిటీస్ మార్కెట్‌లో దీని ప్రభావం కన్పిస్తోంది. క్రూడ్ ఆయిల్ ఇవాళ మరో రెండు శాతం క్షీణించింది. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 77 డాలర్ల వద్ద ఉంటోంది. ఇక బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి కూడా స్వల్ప నష్టంతో ట్రేడవుతున్నాయి. కార్పొరేట్ సమాచారానికొస్తే… ఇవాళ బ్యాంక్ ఆఫ్ అమెరికా, సిటీ గ్రూప్, గోల్డ్‌మ్యాన్ శాచ్స్, రేపు మోర్గాన్ స్టాన్లీ కంపెనీలు త్రైమాసిక ఫలితాలను వెల్లడించనున్నాయి.