For Money

Business News

బ్లాక్‌ స్టోన్‌ చేతికి బాష్‌+లాంబ్‌?

ఐకేర్‌ రంగంలో పేరున్న కంపెనీ బాష్‌+లాంబ్‌ను ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలైన టీపీజీ, బ్లాక్‌స్టోన్‌ టేకోవర్ చేయనున్నాయి. బాష్‌+లాంబ్‌ టేకోవర్‌లో ఈ రెండు పీఈ సంస్థలే మిగిలినట్లు తెలుస్తోంది. బాష్‌ హెల్త్‌ నుంచి విడిపోయిన తరవాత బాష్‌+లాంబ్‌ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. దీంతో విక్రయించాలని బాష్‌ హెల్త్‌ నిర్ణయించింది. బాష్‌+లాంబ్‌ ఎంటర్‌ప్రైజ్‌ వ్యాల్యూ 1300 కోట్ల డాలర్ల నుంచి 1400 కోట్ల డాలర్లు ఉండొచ్చని తెలుస్తోంది. అంటే ఒక్కో షేర్‌కు టీపీజీ, బ్లాక్‌స్టోన్‌ 25 డాలర్లు చొప్పున కొనేందుకు రెడీ అయ్యాయి. గత శుక్రవారం బాష్‌+లాంబ్‌ షేర్‌ 19.47 డాలర్ల వద్ద ముగిసింది. అంటే దాదాపు 25 శాతం అధికంగా విలువ ఇచ్చేందుకు టీపీజీ, బ్లాక్‌స్టోన్‌ రెడీ అయినట్లు తెలుస్తోంది. ఈ నెలాఖరులోగా అధికారంగా రెండు పీఈ సంస్థలు బిడ్లు సమర్పించవచ్చని ఫైనాన్షియల్‌ టైమ్స్‌ పేర్కొంది. ఈ డీల్‌ కార్యరూపం దాల్చితే.. 2024లో కుదిరిన అతి పెద్ద పీఈ డీల్స్‌లో ఇదొకటి అవుతుంది.