For Money

Business News

కోలుకున్న వాల్‌స్ట్రీట్‌

సెప్టెంబర్‌లో అమెరికా ద్రవ్యోల్బణ రేటు మార్కెట్‌ అంచనాలను మించింది. మార్కెట్‌ వర్గాలు 2.3 శాతం ఉంటుందని అంచనా వేయగా, వాస్తవ రేటు 2.4 శాతంగా వచ్చింది. ద్రవ్యోల్బణ రేటు అధికంగా ఉంటే నవంబర్‌లో ఫెడరల్‌ రిజర్వ్‌ కేవలం పావు శాతం మాత్రమే వడ్డీ రేట్లను తగ్గిస్తుందని మార్కెట్‌ అంచనా. దీంతో వాల్‌స్ట్రీట్‌ నష్టాల్లో ప్రారంభమైంది. కొన్ని సూచీలు దాదాపు అర శాతం దాకా నష్టపోయాయి. అయితే క్రమంగా కోలుకుంది. ప్రస్తుతం నాస్‌డాక్‌ 0.11 శాతం లాభంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ 0.02 శాతం నష్టంతో ఉంది. ఈ సూచీ ఏ క్షణమైనా గ్రీన్‌లోకి వచ్చేలా ఉంది. డౌజోన్స్‌ ఒక్కటే 0.14 శాతం నష్టంతో ఉంది. ఇవాళ డాలర్‌ అరశాతం పెరిగింది. దీంతో క్రూడ్‌ పెరిగింది. పైగా ఇవాళ ఇరాన్‌పై దాడికి ఇజ్రాయిల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందన్న వార్తలతో క్రూడ్‌ ధరలు భారీగా పెరిగాయి. బ్రెంట్‌ క్రూడ్‌ మళ్ళీ 79 డాలర్లకు చేరువైంది.

Leave a Reply