For Money

Business News

ఇళ్ల అమ్మకాలు ఢమాల్‌

రియల్‌ఎస్టేట్‌ షేర్లు పెరుగుతున్నా… కంపెనీల అమ్మకాల్లో పెద్దగా వృద్ధి కన్పించడం లేదు. వడ్డీ రేట్లు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని వార్తలు వస్తున్న నేపథ్యంలో రెసిడెన్సియల్‌ ఇళ్ళకు డిమాండ్‌ తగ్గుతోంది. జులై-సెప్టెంబర్‌ మధ్య కాలంలో దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో గత ఏడాది 1,01,221 యూనిట్ల రెసిడెన్షియల్‌ ఇళ్లు అమ్ముడుబోగా… ఈ ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 5 శాతం తగ్గి 96,544 యూనిట్లకు పడిపోయింది. ప్రాపర్టీ బ్రోకరేజీ సంస్థ ప్రాప్‌టైగర్‌ ఈ వివరాలను వెల్లడించింది. హైదరాబాద్‌ విషాయనికొస్తే గత ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 14,191 యూనిట్ల ఇళ్లు అమ్ముడుపోగా, ఈ ఏడాది 19 శాతం క్షీణించి 11,564 యూనిట్లకు పడిపోయాయి. వడ్డీరేట్లు తగ్గపోగా.. ముడి పదార్థాల ధరలు భారీగా పెరగడంతో రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు ఇబ్బందుల్లో పడుతున్నాయి. ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడిందని.. కాని అదే సమయంలో డిమాండ్‌ ఉండటం లేదని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు అంటున్నాయి. జులై- సెప్టెంబర్‌ మధ్య కాలంలో దేశంలోని ఎనిమిది నగరాల్లో ఇళ్ల ధరలు 20 శాతం పెరిగాయి. దీంతో డిమాండ్‌ తగ్గుతోందని రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలు అంటున్నారు.

Leave a Reply