For Money

Business News

ఐపీఓ ధర రూ. 1960?

దేశ చరిత్రలో అతి పెద్ద ఐపీఓగా చరిత్ర సృష్టించనున్న హ్యుండాయ్‌ ఇండియా ఐపీఓ ఈ నెలలో రావడం ఖాయంగా కన్పిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈనెల 15వ తేదీన ప్రారంభమై… 17వ తేదీన ముగియనుంది. పబ్లిక్‌ ఆఫర్‌ ధరల శ్రేణి రూ.1865 నుంచి రూ. 1960 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే కంపెనీ వ్యాల్యూయేషన్‌ 1900 కోట్ల నుంచి 2000 కోట్ల డాలర్లుగా తేలుతుంది. 2003 తరవాత అంటే మారుతీ సుజుకీ తరవాత ఓ కార్ల తయారీ కంపెనీ పబ్లిక్‌ ఆఫర్‌కు రావడం ఇదే తొలిసారి. పైగా అతి పెద్ద ఐపీఓ కూడా. మార్కెట్‌ నుంచి 300 కోట్ల డాలర్లు సమీకరించేందుకు ఉద్దేశించిన ఈ ఇష్యూ సంస్థాగత ఇన్వెస్టర్ల కోసం ఈనెల 14న ప్రారంభమౌతుందని తెలుస్తోంది. ఈనెల 22వ తేదీన షేర్లను స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్ట్‌ చేయాలని హ్యుండాయ్‌ మోటార్స్‌ భావిస్తోంది. దక్షిణ కొరియా వెలుపల హ్యుండాయ్‌ పబ్లిక్‌ ఆఫర్‌ చేయడం భారత్‌లోనే.

Leave a Reply