For Money

Business News

స్వల్ప టెక్నికల్‌ ర్యాలీ?

మార్కెట్‌లో వచ్చే వారం ఆరంభంలోనే నిఫ్టికి కీలక పరీక్ష ఎదురు కానుంది. డైలీ చార్ట్స్‌లో నిఫ్టి 50 రోజుల చలన సగటు దిగువకు వచ్చినా… వీక్లీ చార్ట్‌లలో 20 రోజుల చలన సగటును కూడా ఇంకా టచ్‌ చేయలేదు. నిఫ్టి 25000పైన ఉన్నంత వరకు ఢోకా లేదని… దిగువకు వస్తే మాత్రం 20 రోజుల చలన సగటును క్రాస్‌ చేస్తుందని ఈక్విటీ రీసెర్చి డాట్ ఏషియా వ్యవస్థాపకుడు, టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలన్‌ వైష్ణవ్‌ అంటున్నారు. మార్కెట్ గమనంపై ఆయన ఎకనామిక్‌ టైమ్స్‌కు ప్రత్యేక విశ్లేషణ రాశారు. వచ్చే వారం మార్కెట్ నిలకడగా ఉండొచ్చని, 25300 లేదా 25430 ప్రాంతంలో ప్రతిఘటన ఎదురు కావొచ్చని ఆయన అంచనా వేస్తున్నారు. ఒకవేళ 25000 దిగువకు నిఫ్టి పడితే 24910 లేదా 24600 వద్ద మద్దతు లభిస్తుందని అన్నారు. డెరివేటివ్స్‌ మార్కెట్‌ డేటా పరిశీలిస్తే 25000 ప్రాంతంలో నిఫ్టికి మద్దతు లభించవచ్చని మిలన్‌ అన్నారు. దీనికి ప్రధాన కారణం 25000 స్ట్రయిక్‌ రేటు వద్ద అత్యధిక పుట్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ ఉండటమేనని ఆయన అన్నారు. ఇదే స్ట్రయిక్‌ వద్ద కాల్‌ ఓపెన్‌ ఇంటరెస్ట్‌ పెద్దగా లేదని అన్నారు. మొత్తంమీద మార్కెట్‌ డౌన్‌ట్రెండ్‌లో ఉన్నా… చిన్న ర్యాలీ వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమని ఆయన అన్నారు.

Leave a Reply