For Money

Business News

నిలకడగా నాస్‌డాక్‌

వాల్‌స్ట్రీట్‌ ఆరంభంలో మిశ్రమంగా ఉన్నా… తరవాత నష్టాల్లోకి జారుకుంది. ముఖ్యంగా డౌజోన్స్‌ అరశాతం నష్టంతో ట్రేడవుతోంది. పశ్చిమాసియాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో పాటు డాలర్‌ పెరగడంతో ఇన్వెస్టర్ల సురక్షిత సాధనాలవైపు మళ్ళుతున్నారు. క్రూడ్‌ ధరలు భారీగా పెరగడంతో… క్రూడ్‌ ఆధారిత పరిశ్రమల షేర్లపై ఒత్తిడి పెరుగుతోంది. ఐటీ, టెక్‌ షేర్లకు ప్రాతినిధ్యం వహించే నాస్‌డాక్‌ మాత్రం నిలకడగా ఉంది. కేవలం 0.18 శాతం నష్టంతో ట్రేడవుతోంది. ఎస్‌ అండ్‌ పీ 500 సూచీ కూడా 0.28 శాతం ఉంది. సెమి కండక్టర్‌ షేర్లు ఎన్‌విడియా, ఏఎండీ ఇవాళ కూడా ఆకర్షణీయ లాభాలతో ఉన్నాయి. ఇక డాలర్‌ ఇండెక్స్‌ ఇవాళ కూడా బలంగా ఉంది. 102కు చేరువలో ఉంది. మరి సెషన్‌ చివరికల్లా మార్కెట్‌ మరింత కుంగుతుందా లేదా కోలుకుంటుందా అనేది చూడాలి.