For Money

Business News

బ్యాంక్‌ అకౌంట్‌ లేకున్నా గూగుల్‌ పే

గూగుల్‌ పేలో యూపీఐ సర్కిల్‌ సదుపాయాన్ని గూగుల్‌ తీసుకు వచ్చింది. బ్యాంక్ ఖాతా లేనివారు కూడా గూగుల్‌పే ద్వారా చెల్లింపులు చేయొచ్చు. దీని కోసం గూగుల్‌ పే, బ్యాంక్‌ అకౌంట్‌ ఉన్న యూజర్లు తమ యూపీఐ ఖాతాను ఇతరులతో షేర్‌ చేసుకోవచ్చు. దీంతో బ్యాంక్‌ అకౌంట్‌ లేకున్నా ఇతరులు పేమెంట్‌ చేసుకోవచ్చు. గూగుల్‌ పే ద్వారా ఇకపై రూ.5 లక్షల వరకు వ్యక్తిగత రుణం తీసుకోవచ్చని గూగుల్‌ తెలిపింది. తమ ప్లాట్‌ఫామ్‌ ద్వారా రూ.50 లక్షల వరకు గోల్డ్‌ లోన్‌ తీసుకోవచ్చని గూగుల్‌ పేర్కొంది. ఇందుకోసం ముత్తూట్‌ ఫైనాన్స్‌తో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపింది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ)తో కలిసి ఈ ఫీచర్‌ను అభివృద్ధి చేసినట్ఉల గూగుల్‌ పే పేర్కొంది.
సర్కిల్‌ ఇలా పనిచేస్తుంది
గూగుల్‌ సర్కిల్‌ ప్రధానంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల కోసం తెచ్చినట్లు తెలుస్తోంది. అయితే ప్రైమరీ యూజర్‌ అంటే బ్యాంక్‌ ఖాతా, యూపీఏ ఐడీ ఉన్నవారు… ఇతరులు అంటే సెకండరీ యూజర్లతో తమ బ్యాంకు అకౌంట్‌ను లింక్‌ చేసుకోవచ్చు. ఇలా లింక్‌ చేసుకునే సమయంలో రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి ప్రైమరీ యూజర్‌ నుంచి నెలకు రూ. 15వేల వరకు నేరుగా పేమెంట్‌ చేసుకోవచ్చు. అంటే ప్రతి లావాదేవీకి ప్రైమరీ యూజర్‌ అనుమతి అక్కర్లేదు. రెండో ఆప్షన్‌… సెకండరీ యూజర్‌ పేమెంట్‌ చేసే ప్రతిసారీ ప్రైమరీ యూజర్‌ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఓకే చెప్పాల్సి ఉంటుంది. ఈ సౌకర్యం కుటుంబ సభ్యులకు పనికి వస్తుందని భావిస్తున్నారు.