యుద్ధాన్ని పట్టించుకోని మార్కెట్
వాల్‌స్ట్రీట్ స్వల్ప నష్టాలతో ప్రారంభమైనా… వెంటనే లాభాల్లోకి వచ్చింది. ఆరంభంలో పశ్చిమాసియా యుద్ధ భయాలతో మార్కెట్ నష్టాలతో ప్రారంభమైంది. ఏడీపీ చక్కటి ఫలితాలను ప్రకటించడంతో టెక్, ఐటీ షేర్లలో ర్యాలీ మొదలైంది. నాస్‌డాక్‌తో పాటు ఎస్ అండ్ పీ 500 సూచీలు గ్రీన్‌లోకి వచ్చాయి. డౌజోన్స్ కూడా నష్టాలను పూడ్చుకుని లాభాల్లోకి వచ్చింది. మరి ఈ ట్రెండ్ చివరిదాకా కొనసాగుతుందా అనేది చూడాలి. పశ్చిమాసియాలో ఇజ్రాయిల్ ప్రతిచర్యపై మార్కెట్ చర్చిస్తోంది. మరోవైపు వంద లోపు పడిపోతుందని భావించిన డాలర్ ఇండెక్స్ ఇపుడు 101పైన లాభాల్లో ట్రేడవుతోంది. యుద్ధ భయంతో క్రూడ్ ఆయిల్ భారీగా లాభపడింది. నిన్న బ్రెంట్ క్రూడ్ 68 డాలర్లను తాకగా… ఇవాళ 74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అయితే అధిక స్థాయిల వద్ద ఒత్తిడి ఎదురవుతోంది. ఆయిల్ సరఫరాలో పెద్దగా ఇబ్బందులు ఉండవంటూ వస్తున్న వార్తలతో క్రూడ్ జోరు ఆగింది. బులియన్ మార్కెట్లోనూ ఇదే పరిస్థితి కన్పిస్తోంది. నిన్నటి ధరల వద్దే వెండి, బంగారం కదలాడుతున్నాయి.