For Money

Business News

నిలకడగా వాల్‌స్ట్రీట్‌

మరికొన్ని గంటల్లో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ చీఫ్‌ జెరొమ పావల్‌ ప్రసంగం ఉంది. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్‌ నిలకడగా ఉంది. సూచీల్లో పెద్ద హెచ్చు తగ్గులు లేవు. డౌజోన్స్‌ నష్టాల్లో ఉండగా, నాస్‌డాక్‌, ఎస్‌ అండ్‌ పీ 500 గ్రీన్‌లో ఉన్నాయి. అయితే మార్పులు తక్కువ. టెక్‌ షేర్లలో యాపిల్, మెటా షేర్లు మాత్రం ఒక మోస్తరు లాభాలతో ఉన్నాయి. ఇజ్రాయిల్‌-లెబనాన్‌ యుద్ధం కారణంగా క్రూడ్‌ ఆయిల్‌ 72 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మరోవైపు డాలర్‌ కూడా కాస్త గ్రీన్‌లో ఉంది. డాలర్‌ ఇండెక్స్‌ ఏక్షణమైనా 100 లోపునకు పడిపోయే ఛాన్స్‌ ఉంది. ప్రస్తుతం 100.39 వద్ద ట్రేడవుతోంది. బులియన్‌ మార్కెట్‌ కూడా డాలర్‌కు రియాక్ట్‌ అవుతోంది. డాలర్‌ గ్రీన్‌లో ఉండేసరికి … బులియన్‌ రెడ్‌లోఉంది. సిల్వర్‌ ఒక శాతంపైగా నష్టంతో ఉంది. బంగారం ధరల్లో పెద్ద మార్పు లేదు. ఇటీవల 2700 డాలర్లను తాకిన బంగారం ఇపుడు 2658 డాలర్ల ప్రాంతంలో ట్రేడవుతోంది.

Leave a Reply