For Money

Business News

2 కోట్ల సిమ్‌ కార్డులు రద్దు?

సైబర్‌ నేరాలతో లింక్ ఉన్న సుమారు రెండు కోట్ల సిమ్‌ కార్డులను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోంది. నకిలీ పత్రాలు సమర్పించి పొందిన, సైబర్ క్రైమ్‌లలో ప్రమేయం ఉన్నట్లు భావిస్తున్న ఈ కార్డులను రద్దు చేసే అవకాశముంది. ఇలాంటి కార్డుల సంఖ్య 2.17 కోట్ల వరకు ఉన్నట్లు సమాచారం. దీనితో పాటు 2.26 లక్షల మొబైల్‌ ఫోన్లను బ్లాక్‌ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. సిమ్‌ కార్డులు జారీ చేసేప్పుడు నో యువర్ కస్టమర్(KYC)ని సరిగా అమలు చేయకపోవడం వల్ల ఈ సమస్య తలెత్తినట్లు అధికారులు భావిస్తున్నారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

Leave a Reply