For Money

Business News

చివర్లో 26,000 గట్టుపై నిఫ్టి

దాదాపు రోజంతా రెడ్‌లో ఉన్న మార్కెట్‌ చివరి అరగంటలో లాభాల్లో ముగిసింది. ఇవాళ బ్యాంక్‌ నిఫ్టి డెరివేటివ్స్‌ వీక్లీ, నెలవారీ క్లోజింగ్‌ కావడంతో… చివర్లో ఆ షేర్లలో షార్ట్‌ కవరింగ్‌ వచ్చింది. రోజంతా బ్యాంక్‌ నిఫ్టి లాభాల్లో ఉన్నా… నిఫ్టి మాత్రం నష్టాల్లోనే ఉంది. అయితే నష్టాలు నామమాత్రంగానే ఉన్నాయి. సరిగ్గా 3 గంటల వరకు నష్టాల్లో ఉన్న నిఫ్టి ఒక్కసారి పరుగులు అందుకుంది. కేవలం అర గంటలో వంద పాయింట్లకుపైగా లాభపడింది. క్రితం ముగింపుతో పోలిస్తే 63 పాయింట్ల లాభంతో 26,004 పాయింట్ల వద్ద ముగిసింది. రేపు నిఫ్టి డెరివేటివ్స్‌ నెలవారీ, వీక్లీ క్లోజింగ్‌. రోజంతా ఆసియా మార్కెట్లు దుమ్మురేపాయి. చైనా, హాంగ్‌కాంగ్‌ మార్కెట్లు భారీ లాభాల్లో ముగిసింది. డెరివేటివ్స్‌ ముగింపుతో పాటు అమెరికా ఫ్యూచర్స్‌ డల్‌గా ఉండటంతో ఇన్వెస్టర్లు తమ పొజిషన్స్‌కు దూరంగా ఉన్నట్లు కన్పిస్తోంది. ఇక నిఫ్టి విషయానికొస్తే 30 షేర్లు లాభాల్లో క్లోజ్‌ కాగా, 20 షేర్లు లాభాల్లో ముగిశాయి. బ్యాంక్‌ నిఫ్టి, ఫైనాన్షియల్‌ సూచీలు గ్రీన్‌లో క్లోజ్‌ కాగా, స్మాల్‌.. మిడ్‌క్యాప్‌ సూచీలు నష్టాల్లో ముగిశాయి. నిఫ్టిలో టాప్‌ గెయినర్‌ అయిన పవర్‌గ్రిడ్‌ 4 శాతం లాభపడింది. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ రెండు శాతం లాభంతో ముగిశాయి. గ్రాసింలో బుల్‌ రన్‌ ఇవాళ కూడా కొనసాగింది. ఇక నిఫ్టి లూజర్స్‌లో అధికంగా ఎకానమీ షేర్ల ఉన్నాయి. టాప్‌ లూజర్‌ ఎల్‌ అండ్‌ టీ మైండ్‌ ట్రీ కాగా, టెక్‌ మహీంద్రా, టాటా కన్జూమర్‌, టాటా మోటార్స్‌, టైటాన్‌ షేర్ల ఉన్నాయి.

Leave a Reply